కవిత కొత్త పార్టీ పేరు TRS
25-04-2026 10:28 AM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లో కల్వకుంట్ల కవిత పార్టీ(Kalvakuntla Kavitha New Party) ఆవిర్భావ సభ జరుగుతోంది. కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. కవిత కొత్త పార్టీ పేరు TRS( Telangana Raashtra Sena). ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... నా జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి.. పిడికిలి బిగించి కొట్లాడామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందని కవిత గుర్తుచేశారు.






