25 April, 2026 | 11:47 AM

నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

25-04-2026 10:01 AM

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా(Peddapalli District) దారుణం శనివారం చోటుచేసుంది. నిద్రిస్తున్న అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అర్ధరాత్రి మంథని మండలం(Manthani Mandal) లక్కేపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిని ఇంట్లోకి రానివ్వట్లేదని తమ్ముడు ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలోనే తమ్ముడు అనిల్ కిటికీ నుంచి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మంటలు చెలరేగి అన్న రఘుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే అతన్ని వరంగల్ ఎంజీఎంకు(Warangal MGM Hospital) తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.