సీఎం కర్కోటకుడు.. రెండేళ్ల తర్వాత మనదే అధికారం: కవిత
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కవిత(Kavitha) క్షమాపణలు చెప్పారు. ఆనాడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు బాధపడుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా అన్నారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని కవిత ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడినవాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఉద్యమంలో మనల్ని తిట్టిన వాళ్లు పదవుల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. పదేళ్లలో 30 వేల మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వొచ్చన్నారు. ఎంత మంది ఉద్యమకారులకు అవకాశాలు వచ్చాయని ప్రశ్నించారు.
కాళేశ్వరం లో అవినీతి గురించి చెబతితే తననే పార్టీ నుంచి గెంటేశారని మండిపడ్డారు. అవినీతి చేసిన పందికొక్కులను పక్కనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తప్పులు చాలా ఉన్నాయని ఆరోపించిన కవిత ఇప్పుడున్న సీఎం(CM Revanth Reddy) కర్కోటకుడు, హిట్లర్ లాంటి వాడని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీలు అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయన్నారు. ఐదు అంశాల కోసం తాను కోట్లాడుతూ అన్నారు.
ఇది ప్రారంభం మాత్రమే అన్న కవితన ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నారు. రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందని వ్యాఖ్యనించిన కవిత రెండేళ్ల తర్వాత మనదే అధికారం అన్నారు. బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని చెప్పారు. మెడ మీద తల లేని ఓ బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ తో పోల్చారని మండిపడ్డారు. బీజేపీ బానిస ఎంపీలు కనీసం మాట్లాడలేదన్నారు. బీజేపీ ఎంపీలకు చేతనైతే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తెేవాలని సవాల్ చేశారు.






