29 August, 2026 | 1:09 AM

బల్దియా సమావేశం సజావుగా సాగేనా..?

29-08-2026 12:00 AM
  1. ప్రజా సమస్యలపై కౌన్సిలర్‌లు గొంతు విప్పుతారా..
  2. సమస్యలు గాలి కోదిలి... రచ్చ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారా 
  3. నేడే కామారెడ్డి బల్దియా సమావేశం 

కామారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ సమావేశం పాలకవర్గ ఏర్పడి నుంచి సజావుగా సమావేశం నేటికీ జరగలేదు. కామారెడ్డి పట్టణ ప్రజలు కాంగ్రెస్, బిజెపి,  బిఆర్‌ఎస్ పార్టీలకు సమానంగా కౌన్సిలర్లను గెలిపించారు. పట్టణ అభివృద్ధి జరుగుతుందని భావించిన ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా నెరవేరడం లేదు. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి బాధ్యతలు చేపట్టి నుంచి కౌన్సిలర్ల మధ్య సఖ్యత లేక సమావేశాలను సజావుగా కొనసాగించలేకపోతున్నారు.

ఈ సమావేశమైన సజావుగా సాగుతుందా లేక రచ్చ చేసి వాయిదా వేస్తారా వేచి చూడాల్సిందే. మున్సిపల్ సమావేశంలో స్థానిక సమస్యలను కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉండగా తమ పార్టీ కౌన్సిలర్ ల ఆదిపత్యం కోసమే కొంతమంది కౌన్సిలర్ రచ్చ చేస్తున్నారు. ఎవరు రచ్చ చేసిన నష్టపోయేది సామాన్య ప్రజలు మాత్రమే. పాలకవర్గం వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతుంది.

అభివృద్ధి పనులపై పోటీపడి చేయాల్సిన ప్రజాప్రతినిధులు తమ ఆధిపత్యం కోసం విలువైన సమావేశాన్ని రచ్చ చేసి వాయిదాలు వేయిస్తున్నారు. ఇది ఎవరికి మంచిదో ఎవరికి చెడ్డదో ఆ రచ్చ చేసే కౌన్సిలర్లకి తెలియాలి. సమావేశంలో సమస్యలపై కౌన్సిలర్లు వివరించాల్సి ఉండ గా సమస్యలను గాలికి వదిలేసి సమావేశంలో రచ్చ చేస్తున్నారు. దీంతో వార్డుల్లో పనుల గురించి చర్చ జరగకుండానే వాయిదా వేసి చేతులు దులుపుకుంటున్నారు. విలువైన సమావేశ సమయాన్ని కొంతమంది కౌన్సిలర్ల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సమస్యలను సమావేశంలో చర్చించాల్సిన కౌన్సిలర్లు వాటిని గాలికి వదిలేసి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నారు. దీంతో మూడు సమావేశాలు కూడా వాయిదాలతోనే సరి చేశారు. అభివృద్ధి పనులను చర్చించలేకపోయారు. ఈ సమావేశంలోనైనా కౌన్సిలర్లు సంయమ నం పాటించి సమస్యలను సభ దృష్టికి తెచ్చి చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు.

కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, ప్రధాన పార్టీల కౌన్సిలర్ ఆదిపత్య పోరును పక్కనపెట్టి సమస్యలను సమావేశంలో ఏకరువు పెట్టి సమస్యలపై సమావేశంలో నిలదీస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఇదే మీ సమావేశం అని విరక్తి కలిగేలా కొందరు కౌన్సిలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు రచ్చ చేస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారం జరగదు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ఈ సమావేశంలో హుందాగా వ్యవహరించి ప్రజల సమస్యలను కౌన్సిలర్ల ద్వారా సేకరించి పరిష్కరించేందుకు చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సమావేశంలో రచ్చ చేసే కౌన్సిలర్లను బహిష్కరించి సమావేశాన్ని సజావుగా కొనసాగించాలని కొంతమంది కౌన్సిలర్లు కోరుతున్నారు. ఈ సమావేశంలోనైనా ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చి వాటి పరిష్కారం పట్ల పాలకవర్గం చొరవ చూపుతోందని పట్టణ ప్రజ లు ఆశిస్తున్నారు. కనీసం ఈ సమావేశమైన సజావుగా సాగుతున్న లేక తమ ఆధిపత్య  కోసం రచ్చ జరిగి వాయిదారులతోనే సరిపడుతున్న వేచి చూడాల్సిందే. 

సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతాం

కామారెడ్డి బల్దియా సమావేశంలో కౌన్సిలర్లు తమ స్థానిక సమస్యలను సమావేశంలో దృష్టికి తేవాలి. సమావేశంలో కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలపై చర్చించి పరిష్కారానికి చొరవ చూపేందుకు బల్దియా సమావేశం ఎంతో ఉపయోగపడుతుంది. పార్టీలకతీతంగా కౌన్సిలర్లు సంయమనంగా వ్యవహరించి సమావేశంలో ప్రజల సమస్యలను కౌన్సిలర్లు సభ దృష్టికి తేవాలి. మున్సిపల్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతాం.

- పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి