బాలుడిని చితకకొట్టిన ఉపాధ్యాయురాలు యాజమాన్యంపై కేసు నమోదు
బోథ్,(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితక కొట్టిన విషయమై బాలుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి పురుషోత్తం తెలిపారు. గురువారం సాయంత్రం పాఠశాలలో కుసులాపూర్ గ్రామానికి చెందినవిద్యార్థిని కొట్టడంతో గాయాలు తగలడం జరిగిందని బాలుని కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
దీంతో శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చేయడం జరిగింది. అంతేగాక ఎందుకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించడం జరిగింది. అయితే విద్యార్థి మళ్ళీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జువెనైలజస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పిల్లలపై ఇలాంటి హింసకు పాల్పడిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై పేర్కొన్నారు.






