14 July, 2026 | 6:35 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

నేటి కరీంనగర్ బంద్‌కు సహకరించాలి

09-05-2026 12:43 AM

ఎమ్మెల్యే గంగుల 

కరీంనగర్, మే8(విజయక్రాంతి):నేటి కరీంనగర్ బందుకు నగర ప్రజలు సహకరించాలనిఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు నిచ్చారు.ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ల మధ్యన వైరుధ్యం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ కరీంనగర్ చరిత్ర లో ప్రప్రథమంగా.. నా క్యాంపు కార్యాల యం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు.. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని..ప్రభుత్వాన్ని కోరుతున్నా ను. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

గురువారం నా క్యాంపు కార్యాలయం పై దాడి ఘటనను నిరసిస్తూ.. శనివారం రోజున కరీంనగర్ నగర బంద్ కు పిలుపునిస్తున్నామని.. ఈ బందుకు కరీంనగర్ నగర అన్ని వర్గాల ప్రజలతో పాటు, వ్యాపార వాణిజ్య సంస్థలు, బందుకు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని కోరారు,ఈ బందుకు బి ఆర్ ఎస్ పార్టీ  శ్రేణులందరూ శాంతి యుతంగా బంధులో పాల్గొని సహకరించాలని కోరారు.