ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
14-07-2026 07:05 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): కడెం దాస్తురాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్ అక్కడ చికిత్స కోసం వేచి చూస్తున్నా రోగులతో వైద్య ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు రాకుండా జాగ్రత్త గా ఉండాలని పేర్కొన్నారు. ఆసుపత్రి పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించాలని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ వైద్యుల స్వర్ణ రెడ్డి అధికారులు ఉన్నారు






