9 May, 2026 | 2:03 AM

దాడికి నిరసన

09-05-2026 12:44 AM

రుద్రంగి మే 08(విజయక్రాంతి )కరీంనగర్ బిఆరెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ నాయకులు అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బిఆరెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్‌ఆధ్వర్యంలో రోడ్డుపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బిఆరెస్ నాయకులు మాట్లాడుతూ. రాజకీయాల్లో సంస్కారం మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగడం బండి సంజయ్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు.కరీంనగర్లో గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేసి, అక్కడి వాహనాలను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.కార్యక్రమంలో,కంటే రెడ్డి,దయ్యాల పెద్దులు,సింగరపు గంగరాజం,ఈర్ణం రాజేశం,కదాసు లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు...