14 July, 2026 | 7:28 PM

Breaking News

వేంసూరు గ్రామంలో ఏఎంసీ చైర్మన్ శ్రీ దోమ ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు   •   శ్రీనిధి రుణాల రికవరీని వేగవంతం చేయండి   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కల్హేర్ పోలీసులు   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •  

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు

14-07-2026 06:57 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రోజు బొగ్గు గుడిసె నుండి నిజాంసాగర్ వెళ్ళే రహదారి పై నిజాంసాగర్ సబ్-ఇన్‌స్పెక్టర్ జె శివ కుమార్  తన సిబ్బందితో కలిసి ముమ్మర వాహన తనిఖీలు  నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు కార్లతో సహా మొత్తం 120 వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

హెల్మెట్ లేకపోవడం, త్రిబుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, లైసెన్స్ లేకపోవడం,మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలపై మొత్తం 20 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఒరిజినల్, డిజిలాకర్/mParivahan యాప్‌లో) అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.  అనుమానస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియచేయాలి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.