భర్త చేతిలో భార్య దారుణ హత్య
05-08-2026 12:27 AM
- పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
- మృతురాలికి ముగ్గురు పిల్లలు
- సంగారెడ్డి జిల్లా ఇరక్‌పల్లిలో ఘటన
నాగల్‌గిద్ద, ఆగస్టు 4 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలంలోని ఇరక్ పల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ముల్తాన్ తన భార్య ఇర్ఫాన (32)ను ఇంటి నుంచి మౌలాలి దర్గా ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహం దర్గా ప్రాంతంలో లభ్యమైంది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం నిందితుడు నాగల్‌గిద్ద పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తానే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, నాగల్‌గిద్ద ఏఎస్‌ఐ రవీందర్ దర్యాప్తు చేపట్టారు.






