29 July, 2026 | 1:59 AM

ఎందుకు సమాచారం ఇవ్వలేదు..

29-07-2026 12:00 AM
  1. ఎంపీడీవో ను నిలదీసిన చైర్మన్...
  2. యూరియా కోసం వస్తే నీ దగ్గరికే పంపుతా...

తాడ్వాయి,జూలై, 28( విజయ క్రాంతి): మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఉందని ప్రజా ప్రతినిధిని అయిన తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి ఎంపీడీవో భరత్ కుమార్ ను నిలదీశారు. ఈ విషయమై ఎంపీడీవో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం లో సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి చేరుకొని ఎంపీడీవో భరత్ కుమార్ తో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్నారు.మీరు కావాలనే తనకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. చుట్టుపక్కల మండలాలు అయిన లింగంపేట, గాంధారి, రాజంపేట, సదాశివ నగర్ మండలాలలో అందరూ సింగిల్ విండో చైర్మన్ లకు ఎంపీడీవోలు సమాచారం అందించారని వారు సమావేశాలకు సైతం వెళ్లారని తెలిపారు.

కేవలం ఇక్కడ తాడ్వాయిలో ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.కావాలనే నేను బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వాడిని అయినందుకే మీరు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రైతులు యూరియా కోసం వస్తే మీ దగ్గరకే పంపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో భరత్ కుమార్ మాట్లాడుతూ నేను కావాలని చేయలేదని ప్రభుత్వ సర్క్యులర్ లో సర్పంచులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించమని సర్క్యులర్ ఉన్నందున సర్పంచులకు, అధికారులకు మాత్రమే సమాచారం ఇచ్చానని తెలిపారు.

నేను చైర్మన్ ను అవమానపరచడానికి చేయలేదని తెలిపారు.అనంతరం చైర్మన్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో విలేకరుల తో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీడీవో తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కావాలనే తనను అగౌరవపరిచారని తెలిపారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం అవుతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ముదాం నర్సింలు, రాజిరెడ్డి, రాజొద్దీన్, సంజీవులు పాల్గొన్నారు.