15 May, 2026 | 3:03 AM

హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితులు రిమాండ్ తరలింపు

15-05-2026 01:44 AM

తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

తూప్రాన్, మే 14  : మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును తూప్రాన్ పోలీసులు 24 గంటల్లో  చేధించారు. గురువారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్  మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యకు సంబం ధించిన వివరాలు వెల్లడించారు. ఘాట్ కేసర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అన్వర్ తాను జాగ్యతాండ కు చెందిన లలిత తో గత కొంతకాలంగా అక్రమ సంబందం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో మంగళవారం అన్వర్ పని నిమిత్తం శివంపేట్ మండలంలోని జాగ్య తండాకు రావడం జరిగింది.

ఈ వ్యక్తీతో తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయని లలిత తన తమ్ముడు హత్య కేసులో ప్రధాన నింది తుడు. లలిత కొడుకు వీరితో పాటు సమీప బందువులు కలసి పన్నాగం పని అన్వర్ పై కర్రలతో దాడి చేసి హత్య చేయడం జరిగిందని చేసిన హత్యను నుండి తప్పిం చుకొనుటకు శవాన్ని ఒక బైక్ పైన తీసుకొని శభాష్ పళ్లి ప్రాంతంలోని ఒక కంపెనీ సమీపంలో పడ వేయడం జరిగింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా తక్షణమే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని శవాన్ని పరిశీలిం చడం జరిగింది.

అంతేకాకుండా మృతుడి వద్ద ఉన్న ఫోన్, వివిధ వస్తువుల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు హంతకులను పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితురాలు, ప్రధాన నిందితుడు వీరి సమీప బంధువులపై హత్య కేసుగా నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని డిఎస్పి తెలిపారు. అంతేకాకుండా 24 గంటల వ్యవధిలో హత్య కేసు ఛేదించిన సీఐ వెంకట రాజ గౌడ్, శివంపేట్ ఎస్ ఐ మధుకర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని డిఎస్పి నరేందర్ గౌడ్ అభినందిస్తూ అతి త్వరలో రివార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.