గోల్డెన్ బూట్ ఎవరిదో ?
20-07-2026 12:39 AM
- రేసులో దూసుకొచ్చిన ఎంబాపె
- వరల్డ్‌కప్ చరిత్రలో సరికొత్త రికార్డ్
మియామీ, జూలై 19 : సాకర్ ప్రపంచకప్‌లో ఈసారి గోల్డెన్ బూట్ రేస్ రసవత్తరం గా మారింది. నిన్నటి వరకూ మెస్సీ ఆధిక్యంలో ఉంటే, ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత ఎంబాపె దూసుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో రెం డు గోల్స్ చేయడంతో ప్రపంచకప్‌లో తన గోల్స్ సంఖ్యను 10కి పెంచుకున్నాడు. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (22) చేసి మెస్సీ రికార్డు బ్రేక్ చేశాడు. మెస్సి ఖాతాలో ప్రస్తు తం 8 గోల్స్, 4 అసిస్టులు ఉన్నాయి. దీంతో ఫైన ల్లో మెస్సీ ఎన్ని గోల్స్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది.
మెస్సీ గోల్డె న్ బూట్ గెలవాలంటే ఫైనల్లో హ్యాట్రిక్ నమో దు చేయాలి. అప్పుడు ఎంబాపె(10)ను దాటి 11 గోల్స్‌తో అగ్రస్థానం సాధిస్తాడు. ఒకవేళ టైటిల్ పోరు లో రెండు గోల్స్ చేసి ఒక అసిస్టు అందిస్తే కూడా గోల్డెన్ బూట్ కైవసం చేసుకుంటాడు.






