19 July, 2026 | 5:39 PM

FIFA World Cup 2026: తుది అంకానికి FIFA సమరం

19-07-2026 10:56 AM

 అర్జెంటీనా, స్పెయిన్ మధ్య తుదిపోరు

FIFA World Cup 2026: ఫిఫా ప్రంపచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా(Defending champion Argentina), స్పెయిన్ తుదిపోరులో ఫోటీ పడనున్నాయి. న్యూజెర్సీ వేదికగా రాత్రి 12.30 గంటలకు అర్జెంటీనా,స్పెయిన్ మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగో సారి విశ్వవిజేతగా నిలవాలని అర్జెంటీనా కసరత్తు చేస్తోంది. 16 ఏళ్ల తర్వాత మరో కప్పు కొట్టాలని స్పెయిన్ పోరాడుతోంది. అర్జెంటీనాలో స్టెకర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) కీలకం కానున్నారు. గెలిచిన జట్టు సుమారు రూ. 420 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫా ఫైనల్ మ్యాచ్ ను వీక్షించనున్నారు.

గందరగోళంగా సాగిన ప్రపంచ కప్ మూడవ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌లో ఇంగ్లండ్(fifa world cup football england) ఫ్రాన్స్‌ను 6-4 తేడాతో ఓడించగా, కైలియన్ ఎంబాపే ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2026 టోర్నమెంట్‌లో రెండు జట్లూ ఉన్నత ఆశయాలు పెట్టుకున్నప్పటికీ, సెమీఫైనల్‌లో బాధాకరంగా నిష్క్రమించాయి.ఫ్రాన్స్‌ను స్పెయిన్ అధిగమించగా, ఇంగ్లాండ్ అర్జెంటీనా చేతిలో చివరి నిమిషాల్లో కుప్పకూలింది. మయామిలోని తీవ్రమైన వేడిలో శనివారం జరిగిన మ్యాచ్ కోసం ఇద్దరు కోచ్‌లు అనేక మార్పులు చేశారు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆట ప్రారంభంలో బెంచ్‌కే పరిమితమయ్యారు.