21 July, 2026 | 1:35 AM

మేజర్ లీగ్ క్రికెట్ విజేత నైట్‌రైడర్స్

20-07-2026 12:40 AM

ఓక్లాండ్, జూలై 19 : మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్‌లో లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరిత పోరులో ఆ జట్టు కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టును ఓడించింది. మొ దట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 164 పరుగులు చేసింది. తక్కువ స్కోరు చేసినప్పటికీ నైట్ రైడర్స్ కరేబియన్ బౌలర్లు అద్భు తంగా పోరాడారు. కెప్టెన్ సునీల్ నరైన్ పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వాషింగ్టన్ ఫ్రీడమ్‌ను దెబ్బకొట్టాడు. 

వాషింగ్టన్ గెలవడానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతిని ఓబస్ పీనార్ అద్భుతమైన సిక్సర్ కొట్టగా, తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఇదే ఓవర్లో ఫెర్గూసన్ ఓ ఫోర్ కొట్టినా.. చివరి రెండు బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. దీంతో లాస్ ఏంజిల్స్ తొలిసారి నైట్‌రైడర్స్ టైటిల్ కైవసం చేసుకుంది. నరైన్ కేవలం 13 పరుగులిచ్చి 3 వికెట్లు  హోల్డర్ 3 వికెట్లు తీశాడు.