18 March, 2026 | 3:36 AM

ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత ఏదీ?

18-03-2026 01:54 AM

మండలి బీఆర్‌ఎస్ పక్ష నేత మధుసూదనాచారి

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దేశంలో ఏ పార్టీ ఇవ్వదని, ఇచ్చేందుకు సాహసించబోదని మండలి బీఆర్‌ఎస్ పక్ష నాయకులు నాయకులు సి. మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయాలని, వాటికి చట్టబద్దత కల్పించలేకపోయారని బీసీలకు ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అన్యాయమే చేస్తోందని, ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలన్నారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ. 2500 నగదు ఎందుకు ఇవ్వడం లేదని, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందని మధుసూదనాచారి ప్రశ్నించారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ సభ్యు లు ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, దీనిపై స్పష్టమైన విధానం ఉండాలని తెలిపారు. పెన్షన్ బకాయిల విడుదల, జాతీయ విద్యా విధానం-2020 అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.