పాలకవర్గానికి మోక్షం ఎప్పుడు?
బాసర ఆలయంలో సమస్యల తిష్ట lప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లయినా ఏర్పడని కొత్త పాలకవర్గం lఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు పూర్తి అవుతున్న నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పాలకవర్గం ఏర్పాటు కాలేదు. దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసరలో ఆలయ పాలకవర్గం లేకపోవడంతో సిబ్బందిది ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. భక్తుల రద్దీ రోజురోజుకు పెరిగి ఆదాయ వనరులను సమకూర్స్తున్నప్పటికీ ప్రభుత్వం కీలకమైన పాలకవర్గం ఏర్పాటుపై తీవ్ర జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
నిర్మల్, మార్చి 4 (విజయక్రాంతి): బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాలకవర్గాన్ని గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పాటు చేశారు. 2018లో కొత్త పాలకవర్గం ఏర్పడగా 2020లో పాలకవర్గం ముగి సింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆరు సంవత్సరాలుగా కొత్త ఆలయ పాలకవర్గం ఖరారు చేయలేదు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తమిళనా డు కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ గుజరాత్ తదితర ప్రాం తాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
భక్తులకు అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. పాలకవర్గం ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వం నిధులు మంజూరు కావడం ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టే వీలు ఉంటుంది. ముఖ్యంగా బాసర క్షేత్రంలో నిర్వహించే వివిధ ఉత్సవాల్లో పాలకవర్గం లేకపోవడం వల్ల ఆలయ ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులు ఆలయ నిర్వహణ చేపట్టడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నోటిఫికేషన్ వచ్చిన నిరీక్షణ..
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఆలయానికి శాశ్వత అధ్యక్షునిగా శరత్ పాఠక్ వ్యవహరిస్తుండగా మరో 13 ఆలయ పాలకవర్గ సభ్యులను ప్రభుత్వం నామినేటెడ్ చేయవలసి ఉంది. ప్రభుత్వం రెండు నెలల క్రితమే బాసర ఆలయానికి కొత్త పాలకవర్గంలో ఆశావాదుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఇన్చార్జి మంత్రి సహకారంతో ఈ పాలకవర్గ సభ్యులను ఖరారు చేయవలసి ఉంటుంది. పార్టీకి విధేయులుగా ఉండి ధర్మ పరిరక్షణ సామాజిక సేవ ఆధ్యాత్మి క ఉన్నవారిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికీ జిల్లాలోని వివిధ ప్రాంతా లకు చెందిన సుమారు 30 మంది ఆలయ పాలకవర్గంలో తమకు అవకాశం కల్పించాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అయితే నోటిఫికేషన్ ప్రకటించి దరఖాస్తుల స్వీకరించిన ఎంపిక ప్రక్రియ మాత్రం ఇంతవరకు పూర్తి చేయకుం డా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఒకవేళ పాలకవర్గం ఏర్పాటు అయితే బాసర ఆలయ కమి టీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకుని భక్తులకు దేవాలయ అభివృద్ధికి చేపట్టి చర్యలపై చర్చించి కార్యచరణ రూపొందించేందుకు ఈ కమిటీ దోహదపడుతుంది. పాలకవర్గం లేకపోవడంతో అక్కడ పనిచేసి ఉద్యోగులు దాని నిర్వహణ నిర్వహణ బాధ్యతను మోస్తున్నప్పటికీ కొందరు అధికారుల తీరు భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
సిబ్బంది కొరతతో సతమతం..
దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసర ఆలయ నిర్వహణపై ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రెగ్యులర్ ఈవో లేకపోవడంతో ఇంచా ర్జి ఈవోలతోని నెట్టుకొస్తున్నారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులతో పాటు పురోహితుల కొరత కూడా ఉంది. పురోహితుల ఎంపికకు నోటిఫికేషన్ ఇచ్చిన ఇంతవరకు భర్తీ చేయలేదని ప్రచారం జరుగుతుంది.
జూనియర్ సీని యర్ అసిస్టెంట్ పోస్టులు ఇతర పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల నిర్వహణతో ఆలయాల పరిశుభ్రత ఇతర సేవలను చేస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా బాసర ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాల ని జిల్లా ప్రజల కోరుతున్నారు.
ఆలయంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి
దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర ఆలయ అభివృద్ధి పాలకవర్గం ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. గతం లో బాసరకు ప్రభుత్వం 42 కోట్లు నిధులు విడుదల చేసిన పనులు జరగకుండా అవి తిరిగి వెతికి వెళ్లి పోయాయి. ఒకవేళ పాలకవర్గం ఉంటే ఆ నిధులతో బాసరలో అభివృద్ధి పనులు జరిగేవి.
ప్రభుత్వం కూడా ఇటీవలే బాసర అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన డిపిఆర్‌ను తయారు చేయాలని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆదేశించడంతో ఆమె బాసర పర్యటించి ఇక్కడ దేవాదా య అధికారులు, జిల్లా అధికారులతో బాసర అభివృద్ధి డిపిఆర్‌ఫై ప్రణాళిక రూపొందించిన అది ఇంతవరకు కార్యచరణ రూపొందించడం లేదు.




