17 April, 2026 | 3:14 AM

రెండో విడత రైతు భరోసా ఎప్పుడు?

17-04-2026 01:24 AM
  1. గత నెల 22న మొదటి విడత ఎకరా వరకు.. 
  2. గడువు ముగుస్తున్నా అందని పెట్టుబడి సాయం
  3. ఖరీఫ్ పెట్టుబడుల కోసం మళ్లీ రైతన్నలు అప్పుల బాట

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : రెండో విడత రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో ఎకరం భూమి వరకు నిధులు జమచేసిన సర్కార్.. రెండో విడతపై ఇంకా ప్రభు త్వం నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. గత నెల 22న ప్రభుత్వం యాసంగి రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసిన విష యం తెలిసిందే.

ఒక ఎకరం వరకు భూమి కలిగిన సుమారు 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 57.44 లక్షల ఎకరాలకు 3,446.94 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి. ఈ నిధుల విడుదలతో రైతుల్లో కొంత ఊరట కలిగినా, రెండో విడత కోసం ప్రభుత్వం ప్రకటించిన గడువు ముగిసినా నిధులు జమకాకపోవడం వారిని నిరాశపరుస్తోంది. రెండో విడతలో రెండు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రూ. 2,650 కోట్లు, మూడో విడతలో ఐదు ఎకరాల నుంచి మిగిలిన వారికి రూ. 2,670 కోట్లు జమ చేయనున్న ట్లు తెలిపింది.

అయితే మొదటి విడత రైతు భరోసా విడుదలైన 20 రోజుల్లో రెండోవిడత నిధులు జమచేస్తామని చెప్పినా.. ఇప్పటికీ 24 రోజులు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేకుండాపోయిందని రైతాం గం ఆవేదన వ్యక్తంచేస్తోంది. అయితే ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసి, ఖరీఫ్ సీజన్ కూడా సమీపిస్తున్నది. వరి కోతలు మొదలై వరిధాన్యం కోనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొస్తున్నారు.

అయినా రైతు భరోసా నిధులు  ఇంకా పూర్తిగా ఖాతాల్లో జమకాకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. ఇక ఖరీఫ్ పెట్టుబడులకు ఇదే ఆధారం అనుకుంటున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ముందుగానే యాసంగి సీజన్‌కు మూడు విడతలుగా నిధు లు విడుదల చేస్తామని ప్రకటించింది.

మొదటి విడతకూ నోచుకోని రైతులు..

పలు జిల్లాల్లో మొదటివిడత నిధులు కూడా ఇంకా అందని రైతులున్నారు. ఈ విషయంపై స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈఓలు) సంప్రదించిన రైతులకు సరైన సమాధానాలు లభించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆకాల వర్షాల తో పంటలు పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయామని ఆన్నదా తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఎరువులు, విత్తనాలు, కూలీల ఖ ర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి అందాల్సిన భరోసా నిధులు అలస్యమవడం రైతులపై అదనపు భారం మోపుతోంది. ఈ నిధులు సమయానికి అందకపోతే ఇక అప్పుల పై ఆధారపడాల్సి వస్తుందని కాబట్టి ఆలస్యం లేకుండా రైతుల ఖాతాల్లో జమచేయాలని వ్యవసాయ సం ఘాల నాయకులు కోరుతున్నారు.