8 June, 2026 | 10:21 PM

కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్ చేర్చుకుంది

08-06-2026 08:33 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రానికి చెందిన బత్తుల రమేష్ గతంలో టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గా పనిచేసిన ఈయనను రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిలో లపు పోశెట్టి పేర్కొన్నారు. గ్రూపు విభేదాల వల్ల పార్టీని విడిచి పెట్టానని తప్పుడు ప్రచారం చేస్తున్న ఈయనను పార్టీ నుండి బహిష్కరించి సస్పెండ్ చేయడం వల్ల గత్యంతరం లేక బి ఆర్ ఎస్ పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు తక్కువేం చేయలేదని ఆయన ఆగడాలు మితిమీరి పోవడం వల్ల బహిష్కరించామన్నారు. పార్టీ బహిష్కరించబడిన ఈయన తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.