8 June, 2026 | 10:22 PM

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

08-06-2026 08:30 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎంపీడీవో జమలారెడ్డి పేర్కొన్నారు. సోమవారం బూర్గంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా గ్రామంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలకు4 రకాల చెత్త సేకరణల గురించి సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు.