చెట్ల నరికివేత వెనుక మర్మమేంటి?
20-06-2026 01:43 AM
నిర్మల్ జూన్ 19 ( విజయ క్రాంతి) నిర్మల్ మున్సిపాలిటీలో చెట్ల నరికివేత కొనసాగుతుంది. పట్టణంలోని చౌరస్తా నుండి కొండాపూర్ వరకు, చెట్ల నరికివేత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించి మొక్కలను గతంలో నాటక వాటి కొమ్మలను నరికిన అధికారులు ప్రస్తుతం చెట్టు మొత్తం నరికి వేయడం పై పట్టణవాసులు మండిపడుతున్నారు. ఒకవైపు వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటుతున్న అధికారులు నిర్మల్ పట్టణంలో ఉన్న మొక్కలను కొట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే ఆరోగ్యానికి హాని కలిగించే మొక్కలను తొలగించి పూల మొక్కలు నాటనున్నట్టు అధికారులు తెలిపారు.






