20 June, 2026 | 2:54 AM

నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ అంకపాక నవీన్‌కుమార్

20-06-2026 01:42 AM

ఇల్లందు టౌన్, జూన్ 19 (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ నూతన కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందీప్ను 22వ వార్డు మాజీ కౌన్సిలర్ అంకపాక నవీన్ కుమార్ తన మిత్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి, పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇల్లందు పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ మధుకర్, ప్రసాద్ పాల్గొన్నారు.