22 March, 2026 | 12:55 AM

కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?

21-03-2026 06:29 PM

- బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

- బడ్జెట్లో ను మొండి చేయు చూపిన సీఎం రేవంత్ రెడ్డి

- జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్

గజ్వేల్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ప్రశ్నించారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోవడం లేదని,  ప్రతి బడ్జెట్లోనూ బీసీలకు రూ 20 వేల కోట్లు కేటాయిస్తామని, ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లాగానే ప్రస్తుత కాంగ్రెస్ బీసీల సంక్షేమం, సాధికారతను నిర్లక్ష్యం చేస్తుందని, అమలు చేస్తున్న పథకాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాల్సిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న బీసీ కళాశాలలు, గురుకులాలకు నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. బడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న కాంగ్రెస్ కనీసం బిసి కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ విద్యార్థులు, చేతి, కులవృత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలన్నారు. 

ఇప్పటివరకు బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులను అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమాజంలో వెనుకబడిన అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని, దీనిపక్షంలో జాగృతి ఆధ్వర్యంలో చైతన్యం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు.