టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు
నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ నిర్మల్ డిపో ద్వారా వచ్చే నెల 5న కాశీ, అయోధ్య కు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. నిర్మల్ బస్టాండ్ నుంచి 12 బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఏడు రోజుల సర్వీస్ యాత్రల భాగంగా మధ్యప్రదేశ్ లోని మహైర్ శారదా దేవి శక్తి పీఠం, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం, శక్తి పీఠం, కాశీ, కాశీ లోని కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగం, కాశీలో విశాలాక్షి శక్తి పీఠం, అన్నపూర్ణ, కాలభైరవ, 84 ఘాట్లు, ధనవంతర బావి మెదలగునవి, అయోధ్య బాల రాముడు, సరయునది, శ్రీరామ్ పట్టాభిషేకం, తర్వాత లక్నొ దగ్గర గల నైమి శరణ్య దేవతలు యజ్ఞం చేసిన స్థలం, శ్రీ విష్ణు దేవాలయం, గౌమతి నది, చక్రతీర్థమ్,ఉజ్జాయిని, జ్యోతిర్లింగం,ఉజ్జాయిని శక్తి పీఠం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం.
మొత్తం 4 శక్తి పీఠాలు, 3 జ్యోతిర్లింగాలు దర్శించుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. 7 రోజులు యాత్ర ఉంటుందని ఒకరికి రూ.8000/- బస్ ఛార్జి ఉంటుందని ఈ సువర్ణ అవకాశాన్ని భక్తులు సద్వినియోగ పరచుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం ఆర్టీసీ బస్సులోనే క్షేమకరమైన సంతోషకరమైన యాత్రలు చేయాలని డిపోమేనేజర్ తెలిపారు. భక్తులు రిజర్వేషన్ చేసుకోవాలని ఇతర వివరాలకు ఆర్టీసీని సంప్రదించాలన్నారు




