21 March, 2026 | 8:08 PM

నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు

21-03-2026 06:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని  నిర్మల్ బుద్ధ విహార్ లో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగిన  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు చేపట్టారు. ముందుగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి, అంబేద్కర్ పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్ మునేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఈరోల పురుషోత్తం, చించోలి బి గ్రామ అధ్యక్షుడు మట్ట గంగాధర్, మట్ట శృతిలయ,  సింగరి జగదీష్ , జాడే సంజీవ్, భగత్ నారాయణలు తదితరులు పాల్గొన్నారు. . స్వీట్లు, పండ్లు, పులిహోర, పాయసం  పంపిణీ చేశారు.