27 July, 2026 | 5:55 PM

ప్రజల సంక్షేమమే మనందరి అంతిమ లక్ష్యం

27-07-2026 04:57 PM

 ఐక్యతతో అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం 

 ప్రజా ప్రతినిధులతో దేవరకద్ర ఎమ్మెల్యే సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి

చిన్న చింతకుంట  : ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దమగ్నపుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. గ్రామంలో పూర్తిస్థాయిలో పట్టుండాలని ఏ కుటుంబ సభ్యులకి ఏ అవసరం ఉందో తెలుసుకొని సాధ్యమైనంత వరకు సహాయం చేయాలని సంకల్పంతో అడుగులు వేయాలని సూచించారు. నిర్లక్ష్యమని మాటకు తావు లేకుండా ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి పూర్తిస్థాయిలో ఎల్లప్పుడూ ఉండేలా చూడాలని నాయకులను కోరారు. ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.