27 July, 2026 | 5:33 PM

వార్డు సభ్యుడిపై దాడిని ఖండించిన వార్డ్ మెంబర్స్ ఫోరం

27-07-2026 05:07 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలం లంబాడిపల్లె (కె) గ్రామ వార్డు సభ్యుడిపై జరిగిన దాడిని తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ గులాం జావిద్ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత వార్డు సభ్యుడికి ఫోరం పూర్తి మద్దతుగా ఉంటుందని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని గులాం జావిద్ తెలిపారు.