27 July, 2026 | 5:59 PM

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

27-07-2026 05:10 PM

అమరవీరులకు ఘన నివాళులు 

ముకరంపుర,(విజయ క్రాంతి): దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే భారత సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, అలవర్చుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.కార్గిల్ విజయ్ దివస్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల సేవలను కొనియాడారు.భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం చేసిన కృషి  అమోఘం అని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచ వేదికపై భారత్ తన శక్తి సామర్థ్యాలను చాటిందన్నారు. కార్యక్రమం అనంతరం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మి ప్రకాష్, కర్రే పద్మ అనిల్, గాజా రమా శివరాం,రిటైర్డ్ ఆర్మీ  జవాన్లు, లయన్స్  క్లబ్ సభ్యులు పాల్గొన్నారు