27 July, 2026 | 5:55 PM

ఏపీజే అబ్దుల్ కలాంకు ఘన నివాళి

27-07-2026 04:56 PM

కల్వకుర్తి (వెల్దండ): భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని సోమవారం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగానికి, యువతకు స్ఫూర్తినిచ్చేలా డాక్టర్ కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.