నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష
27-07-2026 05:51 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీలోని వివిధ బూత్ ల బీఎల్ వో లను భాజపా పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ కలిసి సర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటరు ధ్రువీకరణ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపుల ప్రక్రియపై వివరాలు తెలుసుకోవడంతో పాటు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ప్రతి అర్హులైన ఓటరికి అవకాశం కల్పించేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని బిఎల్వోలకు సూచించడం జరిగింది. అలాగే కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు మరియు సౌకర్యాలు సరిగా లేక ఓటర్లకు దూరంగా ఉన్న దగ్గర పోలింగ్ స్టేషన్ల మార్పుల గురించి చర్చించడం జరిగింది.






