వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత
27-07-2026 05:18 PM
మేళ్లచెరువు: స్థానిక మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమ ఆధ్వర్యంలో మండలంలోని వేపల మాధవరం గ్రామానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా 10 లక్షలు చెక్కును యూనిట్ హెడ్ ఎన్ శ్రీనివాసరావు అందజేశారు. అంతేకాకుండా ఒక లక్ష 25 వేల రూపాయల విలువగల ఒక మొబైల్ వాటర్ ట్యాంకర్ ను గ్రామ సర్పంచ్ కె కనకయ్యకు సోమవారం ఆయన అందజేశారు. మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామపంచాయతీలను అభివృద్ధి చేస్తుందని, గ్రామాల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాసరావు అన్నారు.






