ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ
27-07-2026 05:54 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు సోమవారం సేఫ్టీ ఆఫీసర్ కార్యాలయంలో సింగరేణి అధికారుల కోసం ఏఎంబీ, ఏబీ టైపు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఫ్రెష్ అలాట్‌మెంట్‌తో పాటు క్వార్టర్ మార్పు (చేంజ్ ఆఫ్ క్వార్టర్) కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఉద్యోగులకు ఈ కౌన్సిలింగ్ ద్వారా క్వార్టర్లు కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్‌వో టు జీఎం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సి.ఆర్. బానుప్రసాద్ మాట్లాడుతూ... అర్హులైన ఉద్యోగులకు త్వరలో క్వార్టర్ అలాట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. క్వార్టర్ అలాట్‌మెంట్ కమిటీ పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా నిబంధనల ప్రకారమే క్వార్టర్ల కేటాయింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.






