తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ
27-07-2026 05:22 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్18 డివిజన్ పంజాబ్ గడ్డ లొ సోమవారం తొలిముద్ద, ఉప్మా,కిచిడి, కార్యక్రమాన్ని, కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించి మాట్లాడుతూ, పిల్లలకి బాల భరోసా కార్యక్రమాన్ని, ప్రవేశపెట్టడం అభినందనీయమని, భవిష్యత్తులో అంగన్వాడి విద్యార్థుల కోసం ఎన్నో అధునాతనమైన ప్రణాళికలు రూపొందించాలని, ఈ సందర్భంగా తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లు ముంతాజ్, భాగ్యరేఖ, శైలజ, పిల్లలకి సకాలంలో బాల భరోసా కార్యక్రమంలో అల్పాహారం,రుచికరంగా నాణ్యంగా వండి పెట్టాలని, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు అంగనవాడి ఆయాలు పాల్గొన్నారు.






