కొత్తూరు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతాం
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రూ.కోటి 30 లక్షలతో ఐమాక్స్ లైట్లు, పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్
కొత్తూర్ మే 5 (విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.మంగళవారం కొత్తూరు మున్సిపాలిటీలో చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నగరాభివృద్ధి నిధుల నుండి రూ.80 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులకు,రూ.50 లక్షలతో కొత్తూరు మునిసిపాలిటీలో ఐమాక్స్ లైట్ల పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మునిసిపాలిటీ సాధారణ సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి పనులపై,మరియు వేసవి దృష్ట్యా త్రాగునీటి సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎన్ బాలాజీ,వైస్ చైర్మన్ డోలి రవీందర్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ,మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






