6 May, 2026 | 5:23 AM

జర్నలిస్టులకు యూనియన్ గుర్తింపు కార్డుల పంపిణీ

06-05-2026 12:00 AM

ఘట్కేసర్, మే 5 (విజయక్రాంతి) : అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జి. బాలరాజ్, ప్రధాన కార్యదర్శి డి. వెంకట్రాంరెడ్డి తెలిపారు. మంగళవారం ఘట్కేసర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ గుర్తింపు కార్డులను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయని తెలిపారు.

యువ జర్నలిస్టులకు ప్రోత్సాహం అందిస్తూ, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో విలేకరులు వేముల గోవిందరాజ్, కేతం రమేష్,  నామాల శ్రీనివాస్, చింతల నిరంజన్, ఎఫ్. రామకృష్ణ, కుంటోల్ల యాదగిరి, కొండ శ్రీనివాసరెడ్డి, కె.  నరసింహ, సల్లూరి నర్సింగ్ రావు, లంబ రాజు, గంట సత్యనారాయణ, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.