ముత్తంగిలో అంబేద్కర్ భవన నిర్మాణం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూన్ 16: ముత్తంగి గ్రామంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించబోతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ముత్తంగిలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలోని ఎంక చెరువు సమీపంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలానికి పరిశీలించారు.
గ్రామ ప్రజలందరి ఆమోదంతో 200 గజాల స్థలంలో అన్ని వసతులతో భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ డిఇ రామారావు, గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, యాదయ్య, మేరాజ్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






