పూర్తి నివేదికను సమర్పిస్తాం
పురావస్తు శాఖ సహాయ సంచాలకులు నాగలక్ష్మి
అడ్డాకుల జూలై 24: మండలం పొన్నకల్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి లో ఉన్న శిథిలావస్థకు చేరిన మెట్ల బావి( కోనేరు)ను శుక్రవారం పురావస్తు శాఖ సహాయ సంచాలకులు నాగ లక్ష్మీ సందర్శించారు. గ్రామ సర్పంచ్ మహమ్మద్,వార్డ్ మెంబర్ లు,గ్రామ పెద్దలతో ఆమె మాట్లాడి మెట్ల బావి (కోనేరు ) చరిత్ర,ప్రస్తుత పరిస్థితి గురించి పరిశీలించి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సందర్శించినట్లు,కోనేరు పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించనున్నారు ఆమె తెలిపారు. ఉదయం పొన్నకల్ గ్రామం సంద ర్శించినప్పుడు జిల్లా కలెక్టర్ కు గ్రామస్థులు కోనేరు గురించి వివరించారు.జిల్లా కలెక్టర్ సందర్శించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ మేరకు సాయంత్రం పురావస్తు శాఖ సహాయ సంచాలకులు నాగలక్ష్మి సందర్శించారు.






