కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, జూన్ 8 ( విజయ క్రాంతి ): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ ముందుగా నూతన మండల, పట్టణ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, కార్యకర్తలకు పార్టీ, ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. మంగళవారం ఉట్నూరులో నిర్వహించే బిఎల్‌ఎ ట్రైనింగ్ బిఎల్‌ఎలు సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నారు. దేశంలో ఇంధన కొరత వల్ల ఇంధన ఆదా చేయడంలో భాగంగానే నేను కూడా ద్విచక్ర వాహనం పైన పర్యటిస్తున్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోమసే నాగోరావ్ గారు పార్టీకి చేసిన సేవలు గుర్తు చేశారు. పార్టీలో కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జహీర్, పట్టణ అధ్యక్షులు జితేందర్,మార్కెట్ కమిటీ చైర్మెన్ ముఖడే ఉత్తమ్, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
బుల్లెట్ పై పర్యటించి..
అభివృద్ధి పనులు ప్రారంభించి.. దేశం లో ఇంధన కొరత కారణంగా బుల్లెట్ బండి తీసుకొని గ్రామాల్లో పర్యటించారు. ఇంద్రవెల్లి మండలంలోని వడగాంలో నూతన మంజూరు చేసిన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులతో పాటు అంగన్వాడి భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని గుర్తించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






