15 June, 2026 | 1:51 AM

దివ్యశక్తి అపార్ట్‌మెంట్ వాసుల సమస్యలు తీరుస్తాం

15-06-2026 12:35 AM

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంపల్లి, జూన్ 14 (విజయక్రాంతి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్లో దివ్య శక్తి రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ నివాసుల సమస్యలను పరిష్కరించేందుకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మయూరి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపార్ట్మెంట్ వాసుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నివాసులతో స్థానిక సమస్యలపై వివరంగా చర్చించారు. మౌలిక వసతులు,రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు, భద్రత వంటి అభివృద్ధి పనులపై నివాసుల నుంచి సూచనలు, అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తీవ్రంగా పరిగణించి, వాటి పరి ష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని, ప్రజల సమస్యలు నా సమస్యలని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బిజెపి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే,ఇంఛార్జి రవికుమార్ యాదవ్,దివ్య శక్తి అపార్ట్మెంట్ వాసులు, అసోసియేషన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, నాయకులు  మహేష్, మాణిక్ రావు, సీతారామ రాజు, పట్టాభిరామ్, గణేష్, శ్రీను, విజయేందర్, ప్రసాద్, శ్రీనివాస్, రాము, రవీందర్ నాయక్, నాగులు, తదితరులు పాల్గొన్నారు.