25 June, 2026 | 2:04 AM

జూలై 31న ఓటర్ లిస్ట్ వెల్లడిస్తాం..

25-06-2026 01:03 AM
  1. ఫుట్‌పాత్‌పై 40 రోజులున్న వ్యక్తికైనా ఓటు హక్కు
  2. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

చేవెళ్ల, జూన్ 24 (విజయక్రాంతి): భారత ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ) (ప్రత్యేక ఓటరు సవరణ) కార్యక్రమంలో భాగంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇం టింట నిర్వహిస్తున్న ఓటర్ జాబితా మార్పు కొత్త ఓటర్ల నమోదు చేస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనప కలెక్టర్ చంద్రారెడ్డి చేవెళ్ల ఆర్డీవో ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ...

ఈఆర్‌ఓ, ఏఈ ఆర్‌ఓ, బిఎల్వోలు కీలక రోల్ పోషిస్తారు అన్నారు. 2002 ఓటర్ లిస్టు ప్రకారం మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. 18 సంవత్స రాలు నిండిన యువకులను ఓటర్ లిస్టులో చేర్చమన్నారు. 2002 ఓటర్ జాబితాలో ఓటు లేని వారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఐడెంటి ప్రూఫ్ ఆధారంగా కొత్త ఓట్లు నమోదు చేస్తామన్నారు.  ప్రతి ఇంటికి మూడుసార్లు బిఎల్‌ఓ లు వస్తారని వారికి ప్రజలు సహకరించాలన్నారు.

చనిపోయిన వారి ఓటు రిమూవ్ చేసేందుకు నోటీసి ఇవ్వాల్సిన అవసరం లేదని సుమోటాగా స్వీకరించి రిమూవ్ చేస్తామన్నారు. మైగ్రేటెడ్ ఓటర్ల విషయా నికొస్తే విఆర్వోలు నోటీసులు ఇచ్చిన 7 రో జులకు రిమూవ్ చేస్తామన్నారు. ఇల్లు షిఫ్ట్ అయితే ఫారం 8 ఫిల్ చేయాలని భారత దేశంలో ఎక్కడైనా  రెండుచోట్ల ఓట్లు కలిగి ఉంటే ఒకటి రిమూవ్ చేసుకోవాలన్నారు. రెండు ఓట్లు వేయడం నేరమని చట్టరీత్యా శిక్ష అర్హులు అవుతారన్నారు.

భారత ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం 40 రోజులు ఫుట్పాత్ మీద జీవించిన వ్యక్తికైనా ఓటు హ క్కు పొందే అవకాశం ఉందన్నారు. అలాగే అర్హుడైన భారత పౌరుని ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదన్నారు.  31 జూలై 2026న ఓటర్ జాబితా లిస్ట్ వెల్లడిస్తామని చెప్పారు. ఏమైనా లోపాలు ఉంటే సరి చేస్తామన్నారు. ఓటర్ నమోదు విషయంలో అధికారులు తప్పుగా ఓటు నమోదు చేస్తే చట్టరీత్యా శిక్షిస్తామని చెప్పారు. ఈ కార్య క్రమంలో చేవెళ్ల తహసిల్దార్ ఆర్ కృష్ణయ్య, తహసిల్దార్లు గౌతమ్ కుమార్, సురేందర్, పాల్గొన్నారు.