25 June, 2026 | 2:05 AM

వైద్యశిబిరాలను వినియోగించుకోవాలి

25-06-2026 01:03 AM

శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్

శంకర్ పల్లి: జూన్ 24 (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్  పేర్కొన్నారు. బుధవారం నగరంలోని కాంటినెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులోని ఆడిటోరియంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

నగరానికి చెందిన సిటిజన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అభినందించారు. మెగా వైద్య శిబిరంలో రక్త పోటు, షుగర్ పరీక్షలు, ఈసీజీ, రొమ్ము ఆరోగ్య పరీక్ష లు, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, గుండె జబ్బుల నివారణ, క్యాన్సర్ నివారణ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్, డైరెక్టర్ జగదీశ్వర్ గౌడ్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ యోగేష్, కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.