4 March, 2026 | 2:22 AM

అర్హు లైన ప్రతీ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం

03-03-2026 12:00 AM

ఎమ్మెల్యే  కోరం కనకయ్య 

టేకులపల్లి, మార్చి 2 (విజయక్రాంతి): అర్హులైన ప్రతీ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి హరిజనవాడలో కొండ్రు శ్రీలత  ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి హాజరైన మాట్లాడారు. విడతల వారీగా ప్రతీ ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చి  ఆదుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లీశ్వరి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, హౌసింగ్ ఏఈ గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, స్థానిక సర్పంచ్ బోడ బాలు, వార్డ్ మెంబర్లు, నాయకులు లక్ష్మయ్య, సంజయ్, మూడ్ గణేష్, శివ, సర్దార్, బొడ్డు అశోక్, తదితరులు పాల్గొన్నారు.