4 March, 2026 | 4:08 AM

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్

03-03-2026 12:00 AM

ముస్లిం సోదరులకు మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు

కూసుమంచి, మార్చి 2 (విజయ క్రాంతి) : మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కూసుమంచి మండల కేంద్రంలోని శివాలయం రోడ్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్, ఉపసర్పంచ్ లు హాజరైయ్యారు.