యాప్ నవీకరణ తర్వాతే యూరియా అమ్మకాలు
14-05-2026 03:18 PM
బిజినేపల్లి: ఖరీఫ్ పంటల సాగు చేసే నాటికి యూరియా అమ్మకాలు ప్రారంభం అవుతాయని, ప్రస్తుత యూరియా యాప్ నవీకరణలో ఉందని, మే చివరి కల్ల యాప్ రైతులకు అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయాధికారి కమల్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మన గ్రోమోర్ కేంద్రంలో ఎరువు నిల్వలను తనిఖీ చేశారు. ప్రతి వ్యవసాయ దుఖాణంలో తనిఖీలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ లైసెన్సులు పునఃరుద్ధరించుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మకాలు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాలు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.






