14 May, 2026 | 4:27 PM

ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపాధి కూలీలకు చల్లా,ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ.

14-05-2026 03:23 PM

కోనరావుపేట మే 14 (విజయక్రాంతి ): కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ మరియు వార్డు సభ్యులు ఊరడి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు చల్లా మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున ఉపాధి కూలీలు ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప గ్రామ ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు.ప్రజలు తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్, వార్డు సభ్యులు ఊరడి రమేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ నందియా నాయక్, గ్రామ ప్రజలు మరియు బీఆర్‌ఎస్ యువ నాయకులు పాల్గొన్నారు.