14 May, 2026 | 4:31 PM

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

14-05-2026 03:17 PM

జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు   

నిజాంసాగర్ మే 14( విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో  ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురు వారంనాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల ను లబ్ధిదారులకు  అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

అనంతరం అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న గృహపథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రజా పండరి, డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య,సర్పంచ్ లు , వడ్ల బ్రహ్మం, , నందాస్ మోహన్, బొజ్జ అంజయ్య నాయకులు బంగ్లా ప్రవీణ్, గుర్రపు శ్రీనివాస్,బొడ్డు అంజయ్య , సంకు సాయిలు, సాలె రాజు, గఫుర్ తదితరులు పాల్గొన్నారు.