బంధువుల పెళ్లి కోసమని వెళ్లి.. నల్ల చెరువులో శవమైన యువకుడు
ఈదులపల్లి నల్ల చెరువులో పడి నందిగామ యువకుడు మృతి
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బంధువుల వివాహం కోసం వెళ్లిన విజయేందర్, (25) అనే యువకుడు చెరువులో శివమై కనిపించిన విషాదకర సంఘటన నందిగామ మండలం ఈదులపల్లి శివారులో ఉన్న నల్ల చెరువులో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటన వివరాల్లోకి వెళితే నందిగామ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన తేనేటి లక్ష్మయ్య కుమారుడు బుధవారం మామిడిపల్లి గ్రామంలో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరినట్లు తెలిపారు.
మరుసటి రోజు ఉదయం చెరువులో శవమై అగుపించారు.చెరువుగట్టుపై మోటార్ సైకిల్, దుస్తులు, ఫోన్ అగుపించడంతో స్థానికుల సమాచారం మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. నందిగామ యువకుడు మృతి చెందారన్న సమాచారం తెలిసిన నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డ్ సభ్యులు శివగళ్ళ ప్రవీణ్ హుటాహుటిన ఈదులపల్లి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం శవాన్ని షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు తీసుకున్నారు. ఈ విషాదకర సంఘటనలో అటు మామిడిపల్లి ఇటు నందిగామలో తీవ్ర విషాదం అలుముకుంది.






