14 May, 2026 | 4:28 PM

ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన వీరాపూర్ సర్పంచ్

14-05-2026 03:22 PM

బెజ్జంకి,మే14(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి నూతన ఎస్.ఐగా బాధ్యతలు స్వీకరించిన తోట తిరుపతిని గురువారం  వీ గ్రామ సర్పంచ్ చీలుముల సతీష్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీలుముల సతీష్ మాట్లాడుతూ, బెజ్జంకి మండలంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీస్ సేవలు అందించాలని ఆకాంక్షించారు.గ్రామాల్లో జరుగుతున్న సామాజిక సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎస్.ఐ తోట తిరుపతి మాట్లాడుతూ, ప్రజల సహకారంతో మండలంలో చట్టం మరియు శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని, ప్రతి పౌరుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.