30 July, 2026 | 5:17 PM

Breaking News

భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •   కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్‌ ఆవిష్కరణ   •   బెల్ట్‌షాపుల మూసివేతకు పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ తీర్మానం   •   ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   ప్రమాదమని తెలిస్తే కాల్ చేయండి   •   లైసెన్స్ లేని, నాణ్యత లేని విక్రయదారులకు బారీ జరిమానా   •  

బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తాం

13-06-2026 12:00 AM

ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్

హైదరాబాద్, జూన్ 12(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బోనాల జాతరను, ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఎం మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో, కే రాజేష్ యాదవ్, ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ డీసీసీ సెక్రెటరీ అశోక్ కుమార్ యాదవ్‌లు మధుసూధన్‌ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, కే రాజేష్ యాదవ్, అశోక్ కుమార్ యాదవ్‌లు  మాట్లాడుతూ నగరంలో ఉన్న, అమ్మవారి ఆలయాల అభివృద్ధి, తన వంతు కృషి చేయాలని ఆయన్ని కోరినట్లు తెలిపారు.