13 June, 2026 | 3:00 AM

విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

13-06-2026 12:00 AM

18న ఉపవాస దీక్షకు ఆర్టీసీ ఎన్‌ఎంయూ మద్దతు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన 2017, 2021 ఏరియర్స్ ఇతర ఆర్థిక బకాయిలు చెల్లింపులు కో రుతూ ఈ నెల 18న ఆర్టీసీ బస్‌భవన్ వద్ద తలపెట్టిన ఉపవాస దీక్షకు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సంఘీభావాన్ని పూర్తి మద్దతును తెలిపింది. ఈ మేరకు ఎన్‌ఎంయూ అధ్యక్షుడు పి.కమల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నరేందర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సర్వీస్‌లో ఉన్న కార్మికులందరూ సంఘీ భావాన్ని తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.